మద్యానికి బానిసగా మారుతూ కుటుంబ నాశనానికి దారితీస్తున్న పరిస్థితులను మనం ఈరోజు చూస్తూ ఉన్నాము .అది ఎంతగా అంటే మద్యం విసిరే పంజా దెబ్బకి ప్రతి ఒక్కరు చిక్కుకొని బయటికి రాలేక పోతున్నారు .ఎన్నో కుటుంబాలు సంతోషంగా గడుపుతూ జీవనం సాగిస్తూ ఉండగా ,ఒక్కసారిగా ఈ మహమ్మారి కి బానిసగా మారడం కుటుంబాన్ని శోక సంద్రం లో తోస్తోంది .ఇది కుటుంబ నాశనానికి దారితీస్తోంది. ఈ మహమ్మారి ఎక్కువగా పల్లెలలో ఎక్కువగా కనిపిస్తుంది .అదే విదంగా పట్టణాలలో సైతం యువత అధికంగా ఉండటం బాధాకరం .యువత ఎక్కువగా దీనికి బానిస అవుతున్నారు .చదువుకునే వయసులోనే మద్యానికి బానిస కావడం అందర్నీ కలచి వేసే సంఘటన ఇది .
మద్యాన్ని ఇప్పుడు ప్రజలు తమ జీవన విధానం లో ఒక భాగంగా చేసుకున్నారు .రోజు కస్టపడి సంపాదించిన డబ్బును కుటుంబ పోషణకు కాకుండా ,మద్యానికి వెచ్చించడం భాద కల్గించే విషయం .ఆ మత్తుకు బానిసగా మారగా కుటుంబాలను సైతం రోడ్డున పడటం ఇప్పుడు మనం చూస్తున్నాము .కుటుంబంలో కర్త ఆ విదంగా చేస్తే ఇక పిల్లల పరిస్థితి ఏంటి ?వారి యొక్క భవిష్యత్తు ఏంటి ?కనీసం కుటుంబం గురించి ఏ చీకు చింత లేకుండా కస్టపడి సంపాదించిన డబ్బుని తన స్వార్థం కోసం వాడుకొని కుటుంబాన్ని భాద పెట్టడం ఇప్పుడు జరుగుతూ ఉన్న సంఘటనలు .
నాకు ఒక కుటుంబం ఉంది .నాకు పిల్లలు ఉన్నారు .వారి భవిష్యత్తు బంగారం ల ఉండాలి అని కోరుకునే వారు ఎంతమంది ?కుటుంబమును ,పిల్లల గురించి ఏ మాత్రం పట్టింపు లేకుండా మద్యానికి బానిస కావడం విశేషం .ప్రస్తుత కాలంలో ఈ మహమ్మారి యువత ఫై టార్గెట్ చేస్తూ వల విసురుతోంది ,ఆ వలలో చాలా మంది యువత చిక్కుకుపోయి బయటపడలేక పోతున్నారు .
మరీ దారుణమైన పరిస్థితి ఏంటంటే కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవడం .ప్రస్తుత కాలంలో ఇవి ఎక్కువగా జరుగుతుండటం విశేషం .ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం వరకు వెళ్లిందంటే అందుకు కారణం ఏమిటి ?మనిషి జీవితంలో కీలాకా పాత్ర పోషిస్తున్న మద్యనిదా లేక మద్యానికి బానిస అయి కుటుంబాన్ని పట్టించుకోక పోవడమా ?కుటుంబ నాశనానికి కారణం అవుతున్న మద్యాన్ని వెలివేయడం కుటుంబం లోని కర్తకు సాధ్యం కావడం లేదు ,అలాగే కుటుంబ పరిస్థితులపై అవగాహనా పెంచుకోవడం లేదు ,పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచన లేదు .
మద్యం వాలా విసిరితే అందులో చాలామంది చిక్కుకుపోయి జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు .అది తనయొక్క పంజా ని విస్తరించుకుంటూ ,అందరి జీవితాలను నాశనం చేస్తోంది .ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్న ఈ మద్యాన్ని నిషేధించడం మనం ఎన్నుకున్న ప్రబుత్వాల వల్ల కావడం లేదు .ఎందుకంటే ఈ మద్యానికి బానిస అయినవారు ,అవుతున్న వారు కోకొల్లలు .అందువలన ఈ మద్యం వలెనే ప్రభుత్వానికి భారీగా వేల కోట్లు ఆదాయం రావడం విశేషం .కస్టపడి సంపాదించినా డబ్బుని తిరిగి ప్రభుత్వాలకే అప్పజెప్తున్నరు .
0 comments:
Post a Comment