కానీ, ఇక్కడ జరిగేది వేరు. ఎన్నో ఆశయాలతో ఉన్న యువతకు చుక్కెదురవుతోంది. వారు కన్న కలలు ఆవిరైపోతున్నాయి . ఊహించుకున్న ఆశలు (ambitions) నీరుగారిపోతున్నాయి. వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉద్యోగాలు రావడం లేదు. ఎన్నుకున్న ప్రభుత్వాలు యువత ఆశయాలకు కనీసం పునాదులు కూడా వేయడం లేదు. ఎంతో మంది కన్న కలలకు ఆటంకం ఏర్పడుతుంది. వారి ఆశయాలు నిర్జీవంగా మిగిలిపోతున్నాయి.అటు చూస్తే , ప్రభుత్వాల నుండి సమాచారం రాక , ఇటు చూస్తే ఉద్యోగాన్వేషనలో ఎన్నిక (select) కాక యువత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.వారి ఆశయాలు అన్నీ ఆవిరైపోతున్నాయి. ఎంతో ప్రతిభ ఉన్న యువతకు వారి సామర్థ్యాన్ని వెలికితీయడానికి అవకాశం రావట్లేదు అని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా చాలామంది యువత ఎక్కువ ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతోంది. తమ కుటుంబాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలన్న వారి కోరిక నీరుగారిపోతోంది. తమ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని ( faiths) నిలబెట్టుకోలేకపోతున్నామనే వారి దీనావస్థ ఎవరికీ అర్ధం కాదు.ఈ లోకం వారికి ఏమీ ఇవ్వలేదనే భ్రమ వారిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తోంది. వారు సొంతంగా ఏర్పరచుకున్న రెక్కలకు ఎదురుగాలి వీస్తోంది. తమను కన్నవారిని శోకసంద్రంలో ముంచి వెళ్తున్నారు.
మరి,వారి రంగుల ప్రపంచానికి అడ్డం తగులుతున్నది ఎవరు? ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడానికి కారణమేమిటి? ఏం చేస్తే వారి ఆశయం నెరవేరుతుంది.ప్రభుత్వాలు (govt) మారినా తలరాత మారదా ! అన్నట్లుగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, యువతకు ఉపాధి చూపించడం లేదు. కనీసం ఒక మార్గం చూపించకపోవడం గమనార్హం. యువత కన్నకలలు ఊహాజనితంగానే మిగిలిపోతున్నాయి. ప్రతి సంవత్సరం చూస్తే, నిరుద్యోగం సమస్య (unemployment) అంతకంతకూ ( high level) పెరిగిపోతుండడం విశేషం.ప్రతిసంవత్సరం నిరుద్యోగ సమస్య ఎలా ఉందో ఒకసారి గమనించవచ్చు.
Year percentage
2007 3.7
2008 4.1
2009 3.9
2010 3.6
2011 3.7
2012 3.7
2013 3.6
2014 3.5
2015 3.5
2016 3.5
2017 3.4
2018 3.5
0 comments:
Post a Comment