Tuesday, 3 April 2018

సొమ్ము ఒకరిది - సోకు ఒకరిది





మానవులు కష్టపడే తత్వం   గలవారు.  ఆ కష్టానికి తగినట్లుగా   ఫలితము   ఉంటుంది.   అది ఎందులో కష్టపడినా   సరే    ఫలితం    దక్కాల్సిందే.   ప్రస్తుతం మానవులను     డబ్బు  నడిపిస్తోంది .   డబ్బు లేని ప్రపంచమే లేదు అన్నట్లుగా ఉంటుంది.   ప్రతి మనిషి డబ్బుపై ఆధారపడాల్సిందే . డబ్బుకోసం ఎంతకైనా కష్టపడాల్సిందే.  కష్టపడతారు కూడా. డబ్బు అనేది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది.   ఆ డబ్బు కోసం ఎటువంటి పనులు    చేయడానికైనా  సిద్ధంగా ఉంటారు.


   ఒకరు ఎంతో కష్టపడి సంపాదిస్తారు. ఆ డబ్బుని అలాగే పొదుపు చేసుకుంటూ ఉంటారు   (saving money),  కొంతమంది     బంగారం   (gold form) రూపంలో      భద్రపరుచుకుంటారు.    అదంతా  కష్టపడినందుకు    ఫలితం . ఎంత కష్టపడితే  అంత డబ్బు    వస్తుందనే    ఆశ     ప్రతి     ఒక్కరిలోనూ ఉంటుంది.  డబ్బు   వస్తున్న    కొద్దీ మనిషిలో కలిగే  ఆశ  ఎప్పటికీ   తరిగిపోదు.   డబ్బుపై ఉన్న ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ డబ్బు  వస్తున్న కొద్దీ ఇంకా కావాలని అనుకుంటాడు. పగలు,రాత్రి   అనే తేడా   లేకుండా    పనిచేస్తూ  ఎంతో సంపాదిస్తారు. అయితే వారు    సంపాదించిన    దానికి    ఫలితం ఉంటుంది. దానిని భద్రంగా  దాచుకుంటారు.   మరి  ఎంతకాలం   (howmany days )    సంపాదించిన సంపాదనను (earn money)  భద్రపరుచుకుంటారు ?  సంపాదించిన  డబ్బు అలాగే   జాగ్రత్తగా ఉంటుందా ?.



   మనం సంపాదించిన  డబ్బు   ఇంట్లో   అలాగే జాగ్రత్తగా ఉంటుంది      అనుకుంటే     పొరపాటే. మారుతున్న    పరిస్థితుల దృష్ట్యా ,  మారుతున్న కాలానుగుణంగా వాటిని దోచుకునేవారు (theft) మారుతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు . ప్రస్తుతం ప్రతి   ఒక్కరు   టెక్నాలజికి (technology)  అలవాటు పడుతుంటే. వారు కూడా టెక్నాలజీల్లో    ముందుకు   దూసుకుపోతున్నారు .దొంగతనాలు చేయటంలో విభిన్నమైన టెక్నాలజీని ఫాలో (follow)  అవుతున్నారు. ఒక్కరి వల్ల సాధ్యం కాకపోతే గ్రూపుగా పనిచేస్తున్నారు.  ఎవరైనా అడ్డం వస్తే   ఏదైనా  చేయడానికైనా  వెనకాడకపోవడం గమనార్హం.  చంపడానికి    వెనుకాడడం   లేదు . అటువంటి వారు ప్రాణాలు తీయడం  కోసం లెక్క చేయడం     లేదు.   ప్రతి    సంవత్సరం    చూస్తే దొంగతనాలు     చేసేవారు    పెరుగుతుండటం విశేషం.  మరో విషయం  ఏమిటంటే  దొంగతనాలు ఎక్కువగా    యువతే     చేస్తుండటం    అందర్నీ  ఆశ్చర్యాన్ని    కలిగించే   విషయం.



డబ్బు మనిషిని నడిపిస్తుందని దాన్ని దానికి ఇది ఒక పెద్ద    ఉదాహరణగా   చెప్పవచ్చు  .  ఒకరు కష్టపడిన సొమ్మును ఇంకొకరు   దోచుకుంటున్నారు. దోచుకోవడంలో (theft)  కూడా కష్టపడిన  దానికి ఫలితం ఉంటుంది.  ఎవరైనా ఒకసారి ఇల్లు వదిలి వెళ్లాలంటే     ఇక  అంతే    సంగతులు.     వచ్చిన      తర్వాత   చూస్తే   సంపాదించిన  డబ్బు,  బంగారం కనిపించవు.    ఇలా ఒకరు   సంపాదించిన దానికి ఫలితం ఇంకో వారు అనుభవిస్తారు .అందుకే మన   పెద్దలు     సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అని అన్నారు.

1 comment:

  1. Velaayudhan Chits is India's leading and most trusted chit fund company. At Velaayudhan Chits, we offer Chit fund services that help you save money and borrow it when you need it. A chit fund is a simple way to save money every month and get a lump sum amount at the end, which you can use for things like building a home, paying for a loan, wedding, saving for your children’s education, or other important expenses.

    #VelaayudhanChits #ChitFundsIndia #SmartSavings #FinancialFreedom #MoneyMatters #SavingsPlan #FutureReady #TrustedCompany #IndianFinance #SecureSavings

    ReplyDelete