మానవ జీవితం డబ్బు మీద ఆధారపడి ఉంటుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు .ప్రస్తుత సమాజంలో మానవుడు డబ్బు మీద చూపిస్తున్న ప్రేమ సమాజంపై చూపడం లేదు. డబ్బు మీద ఆశతో అసలు జీవితాన్ని ఆనందం గా గడపలేక పోతున్నారు.ఈ సమాజంలో ఏదీ కూడా శాశ్వతం కాదని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆఖరికి మానవ శరీరం కూడా శాశ్వతం గా ఉండదు. అక్రమార్జనతో ఎంతో సంపాదించిన వారు, తమ జీవితం శాశ్వతం కాదని అర్థం చేసుకోలేకపోతున్నాడు .ఏ రంగంలో చూసినా అవినీతి అంతర్భాగంగా ఉండి,అవినీతిపరులు ఎక్కువైపోతున్నారు. ఈ అవినీతి పట్ల మన సామాన్య ప్రజానీకం బాధపడుతోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీన్నినిర్మూలించడానికి ఎవరూ ముందుకు రారు, కనీసం దీని బారిన పడిన వారిని ఆదుకునే వారు సైతం కరువయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్న అవినీతి అంతకంతకు రెట్టింపు అవుతోంది. అక్రమార్జనే ధ్యేయంగా చాలామంది అవినీతికి పాల్పడుతున్నారు. ప్రతి పనిలోనూ అవినీతికి పాల్పడుతున్నారు .ఏ పని చేయాలన్నా అవినీతి ఉండాల్సిందే.
ఈ రోజుల్లో అయితే అక్రమార్జనతో సంపాదించేవారు అంతకంతకు పెరగడంతో అతిశయోక్తి లేదు .అదే విధంగా ఎంత సంపాదించినా సగటు మనిషికి ఆశ చాలడం లేదు.సంపాదించిన దానితో సంతోషంగా అనుభవిస్తాడు అనుకుంటే ,అదీ లేదు .ఎందుకు ఈ తాపత్రయం." మానవజన్మ జీవితాన్ని" ప్రకృతికి అనుగుణంగా జీవించలేమా ? ప్రకృతి మనకు అన్నింటినీ అని అందిస్తోంది .మరి, ఇక మనకు ఏం కావాలి? మరణించిన తర్వాత ఏ ఆస్తులు మనతో రావు కదా? ఇదంతా ఎవరి కోసమైతే చేశావో, ఆ కుటుంబం కూడా మనతోపాటే రాదు. ఎంత సంపాదించినా చివరకు మిగిలేది" జీరో "అని ప్రతి మానవుడు గుర్తించలేకపోతున్నాడు. మన సహాయం కోర వచ్చిన వారికి సహాయం చేయకపోగా, అక్రమ ధనాన్ని సంపాదించడానికి పూనుకుంటున్నారు. భగవంతుడిచ్చిన దానితోతృప్తి పడలేక పోవడం విశేషం.
అవినీతితో ఎంత సంపాదించినా ఆ సొమ్మును అనుభవించడానికి చివరి వరకు జీవించి ఉంటారా అనేది ఎవరు గుర్తుంచుకోవడం లేదు. అజ్ఞానంలో మునిగి తేలుతున్నారు. ఆ భగవంతుడిచ్చిన ఉన్నతమైన జీవితాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. అవినీతి అన్న పదం కేవలం నాలుగు అక్షరాల్లో కూడి ఉంది .కానీ, అవినీతి ఏ రూపంలో ఉంటుందో మనందరికీ తెలుసు .అవినీతి అనేది ప్రస్తుతం ఎక్కడ చూసినా కనబడుతుంది . అంటే సర్వసాధారణమైపోయింది .ప్రతి పనిలో అవినీతి కనపడుతోంది. పురాతన కాలంలో అవినీతి అనేది కనపడకుండా ఉండేది .కానీ, ప్రస్తుతం అయితే ప్రతి ఒక్క విషయంలో అవినీతి లేదంటే అతిశయోక్తి కాదు.
ఒకసారి మనం గమనిస్తే అవినీతి అనేది మొత్తం 175 కంట్రీస్ లలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా 2014 లో చూస్తే 85స్థానం, 2015లో చూస్తే 76వ స్థానం, 2016 లో చూస్తే 79వ స్థానం, 2017 లో చూస్తే 81 వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది .దీనిని బట్టి అవినీతికి ఎంతగా అలవాటు పడుతున్నారో తెలుస్తోంది.
0 comments:
Post a Comment